రవీంద్ర జడేజా భార్య… రివాబా జడేజా ఘన విజయం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ టికెట్‌పై నార్త్ జామ్‌నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రివాబా మాట్లాడుతూ నాకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బీజేపీతో పాటు నా కోసం ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలకు, నాకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది నా విజయం మాత్రమే కాదు ప్రజలందరి విజయం అంటూ తన విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. క్షత్రియ ప్రభాల్యం ఉన్న ఈ సెగ్మెంట్లో రవీంద్ర జడేజా భార్య భారీ మెజారిటీతో గెలుపొందింది.













