అయోధ్య రామయ్యకు కానుకగా భారీ వేణువు!
అయోధ్య నగరంలో శ్రీరాముడి ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్నది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఎవరికీ ఎవరు తమకు తోచిన కానుకలను అయోధ్య నగరానికి పంపుతున్నారు. ఈ క్రమంలోనే 21.6 అడుగుల పొడవున్న వేణువును ఫిలిబిత్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కానుకగా ఇవ్వనున్నది. ఈ భారీ వేణువును ఫిలిబిత్ నుంచి అయోధ్యకు తరలించనున్నారు. ఈ వేణువును ఫిలిబిత్‌కు చెందిన ప్రముఖ హస్తకళాకారుడు నవాబ్ అహ్మద్ భార్య హీనా ఫర్వీన్, అతని కొడుకు అర్మాన్ నబీ, అతని స్నేహితులతో కలిసి తయారు చేయగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ుకు చెందిన హరీశ్ రౌతేలా ఈ వేణుకు పూజలు చేశారు. ఈ నెల 2న అయోధ్య ధామ్‌కు పంపనున్నారు.













