అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుతీరాడు. జై శ్రీరాం నినాదాలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 12:29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ దివ్య ముహూర్తంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రతువును పూర్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలతో పాటు వెండి ఛత్రం, పాదుకలు అందించారు. ఇక సైనిక హెలికాప్టర్లలో అయోధ్య రామాలయంపై పూలవర్షం కురిపించారు. ప్రాణ ప్రతిష్ట వేడుకల సందర్భంగా హారతి ఇచ్చే సమయంలో రామాలయ ప్రాంగణంలో పలు భారతీయ సంగీత పరికరాలతో 30 మంది కళాకారులు ప్రదర్శన చేపట్టారు.













