ఆర్మీ జోలికి వస్తే ఊరుకోం : రాజనాథ్ సింగ్
ఇటీవల జమ్మూ కశ్మీర్లో పూంఛ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూలో పర్యటించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి సైనికుడు మన కుటుంబ సభ్యుడితో సమానం. ప్రతి భారతీయుడి భావన ఇదే. మీకు చెడుచేయాలని చూస్తే సహించేది లేదు. అలాంటి దాడుల్ని అడ్డుకోవడంలో భద్రతా, నిఘా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. మీరంతా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలుసు. మీ దైర్యసాహసాలు, త్యాగాలు వెలకట్టలేనివి. ఒక సైనికుడు అమరుడైతే వేమిచ్చే పరిహారం ఆ నష్టాన్ని పూడ్చలేదు. ప్రభుత్వం మీ వెంటే ఉంటుంది. మీ భద్రత, సంక్షేమం, మాకు అధిక ప్రాధాన్యం అని అన్నారు.













