నూతన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్‌కుమార్
కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. అశోక్ లవాసా రాజీనామాతో ఈనెల 31 నుంచి ఖాళీ అయ్యే స్థానంలో రాజీవ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించినట్లు జారీచేసిన నోటిపికేషన్లో కేంద్ర న్యాయశాఖ సృష్టం చేసింది. రాజీవ్‌కుమార్ 1984 ఝార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి. 1960 ఫిబ్రవరి 19న ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన ఈయన తనకు 65 ఏళ్లు వచ్చేంత వరకూ ఎన్నికల కమిషనర్‌గా కొసాగుతారు. ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ప్రధానమంత్రి ముఖ్య నినాదమైన ఆర్థిక సమ్మిళిత విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ముద్రా యోజనల ద్వారా పేదలకు ద్రవ్య లభ్యత, ఉపాధి కల్పనలో చొరవ చూపారు. ఎంఎస్ఎంఈ రంగానికి 59 నిమిషాల్లో రుణం అన్న కొత్త పథకాన్ని అమలు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా బ్యాంకుల విలీనంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, పెన్షన్ వ్యవస్థల పనితీరును పర్యవేక్షించారు.













