చిన్నమ్మకు రజనీకాంత్ ఫోన్
కరోనా నుంచి కోలుకొని, తమిళనాడుకు చేరుకున్న ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని ఏఎంఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్ వెల్లడించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. చిన్నమ్మ ఆరోగ్యం గురించా ఆరా తీశారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమె ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు అని దినకరన్ మీడియాకు వెల్లడించారు. అలాగే శశికళపై ప్రజల అభిమానంలో ఏ మార్పు లేదని, ఆమె ఏ తప్పూ చేయలేదని వారు నమ్ముతున్నారన్నారు. ఆమెకు లభించిన ఘన స్వాగతమే అందుకు నిదర్శనమని తెలిపారు.













