రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 3,034 మున్సిపల్ వార్డులుండగా, కాంగ్రెస్ 1,197 వార్డులను కైవసం చేసుకుంది. రాజస్థాన్లో మొత్తం 90 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 1,140 వార్డులను బీజేపీ సొంతం చేసుకుంది. బీఎస్పీ 1, సీపీఎం 2, ఎన్సీపీ 46, ఆర్ఎల్పీ 13 కాగా, 634 వార్డులను స్వతంత్రులు దక్కించుకున్నారు. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు ట్విట్టర్ వేదికగా సీఎం గెహ్లోత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలు చాలా ఆనందాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. గెలిచిన వారందరికీ గెహ్లోత్ శుభాకాంక్షలు తెలిపారు.













