రెండు చోట్లా రాహుల్ గాంధీ ఘన విజయం

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ కంచుకోట అయిన రాయ్‌బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత దినేశ్ ప్రతాప్ సింగ్‌పై 3.88 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. 2019లో ఇదే స్థానంలో తన తల్లి సోనియాగాంధీ సాధించిన మెజారిటీని రాహుల్ అధిగమించడం విశేషం. తన సిట్టింగ్ స్థానమైన కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు. సీపీఐ అభ్యర్థి అనీ రాజాపై 3.64 లక్షల ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ మూడోస్థానానికే పరిమితమయ్యారు.