ఈ బాధను దేశం ఎప్పటికీ మరచిపోదు
నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా విరుచుకుపడ్డారు. ఈ బాధను దేశం ఎన్నటికీ మరిచిపోదంటూ విమర్శించారు. దేశ ప్రజలు తమ డబ్బులు తాము తీసుకోవడానికి గంటల తరబడి క్యూల్లో నిలబడేలా నవంబరు 8, 2016న కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2016లో రూ.18 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంటే ఇప్పుడు రూ.31 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంది. మోదీ మిత్రులైన పెట్టుబడిదారుల నల్ల ధనాన్ని తెల్లగా చేయడానికి, సామాన్యులు కూడబెట్టిన డబ్బులతో వారి రుణాలను మాఫీ చేయడానికి ఇది జరిగింది. ఈ బాధను దేశం ఎప్పటికి మరిచపోదు అని అన్నారు.













