తమిళనాడుకు పూర్వవైభవం తెస్తా – రాహుల్
తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు, యావత్ ప్రపంచం తమిళనాడు వైపు చూసేందుకు తాను అండగా నిలుస్తానని కాంగ్రెస్పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులకు కొదవలేదని ప్రపంచానికి మరోసారి తాము చాటుతామని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారంనాడు కోయంబత్తూరులో రాహుల్ పర్యటించారు. వ్యాను నుంచే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, తమిళనాడుతో తనకు విడదీయరాని బంధం ఉందని అన్నారు. ఈ బంధం రాజకీయాలకు అతీతమైనదని, కుంటుంబ బాంధవ్యమని అన్నారు. మీరంతా మా నాయనమ్మ (ఇందిరాగాంధీ)ను ఎంతగానే అభిమానిస్తూ వచ్చారు. ఆ విధంగా నేను మీకు రుణపడి ఉన్నా. మీరు నామీద చూపిస్తున్న ప్రేమ కూడా వెలకట్టలేనిది. అదే సూార్తిేతో నేను ఇక్కడకు వచ్చాను. తమిళనాడుకు పూర్వ వైభవం తెచ్చేందుకు నేను మీకు సహాయకారిగా ఉంటాను. ప్రతిభావంతులకు కొదవలేని తమిళనాడు వైపు యావత్ ప్రపంచం తిరిగి చూసేలా చేస్తాను’ అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన కోసం వచ్చారు. రాహుల్ రాష్ట్రంలో పర్యటించడం గత నెలరోజుల్లో ఇది రెండోసారి.













