సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
మోదీ ఇంటి పేరు పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసు లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇటీవల గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ వేసిన స్టే పిటిషన్ను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. పరువునష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఇటీవల గుజరాత్ హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి కిందికోర్టు శిక్ష విధంచడం సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించడం లేదు. అందుకే పిటిషనర్ అభ్యర్థనను కొట్టివేస్తున్నాం అని తీర్పు వెలువరించారు.













