రాహుల్ గాంధీకి ఊరట!
కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి హైకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టులో విచారణ జరిపింది. రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టనున్నది. 2019లో కర్నాటక కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్‌లో నమోదైన కేసు విచారణ సందర్భంగా రాహుల్‌కు హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఇచ్చింది.













