కీలక సమావేశాలు.. విదేశాలకు రాహుల్
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత పర్యటన కింద ఆయన యూరప్ వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18న ప్రారంభం కానున్నందున దీనికి ఒక రోజు ముందు ఆదివారం ఆయన తిరిగి వస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం ఈ నెల 14న జరగనుంది. రాహుల్ యూరప్ పర్యటన కారణంగా ఈ సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశం లేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం నేపథ్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ బాధ్యతలను సోనియా గాంధీ నిర్వహిస్తున్నారు దేశంలో కీలక పరిణామాలు, సమావేశాలు చోటుచేసుకునే సమయంలోనే ఆయన విదేశీ పర్యటనలు పెట్టుకోవడంపై ఇప్పటికే చాలాసార్లు విమర్శలు వచ్చాయి. అయినా సరే అదే తరహాలో ఈసారి విదేశాలకు వెళ్లడం గమనార్హం.













