హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ
దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ ప్రతి భారతీయ విద్యార్థికీ ఉన్నత అవకాశాలు లభించేలా, వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించేలా చేయటానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. భారత పర్యటనలో ఉన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఢిల్లీలో ఆయనతో సమావేశమయ్యారు. వివిధ దేశాల నేపథ్యమున్న హార్వర్డ్ విద్యార్థులతో భేటీ అద్భుతంగా జరిగింది. భారత్ గురించి, నియంతృత్వ పోకడల గురించి, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సమస్యలు, భౌగోళిక రాజకీయాలకు చైనా విసురుతున్న సవాళ్లు, కృత్రిమ మేధవంటి ఆధునిక సాంకేతికతలు సహా పలు అంశాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తి కనబరిచారని రాహుల్ పేర్కొన్నారు.













