ఇప్పుడు అమెరికాలోనూ… ఇండియాలోనూ అది కనిపించడం లేదు
అమెరికా రాయబారి, విదేశీ సమస్యల నిపుణుడు ప్రొఫెసర్ నికోలస్ బర్న్స్‌తో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్, అమెరికా దేశాలకు సహనం గల దేశాలుగా గుర్తింపు ఉందనీ, అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుతం దాని తాలుకు డీఎన్ఏ వాటి నుంచి మాయమైందని అన్నారు. భారతదేశంలో జరుగుతున్న పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్నది ప్రజాస్వామిక భాగస్వామ్యం అని మీరు ప్రకటించారు.
భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి? అమెరికా బాగా లోతుగా పరిణామాలను విశ్లేషిస్తుందని నేను బలంగా నమ్ముతా. స్వేచ్ఛకు మీ రాజ్యాంగంలో అధిక ప్రాధాన్యమిచ్చారని నముతా. అలా పొందుపరచడం చాలా శక్తిమంతమైన ఆలోచనే. కానీ ఆ శక్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది అని పేర్కొన్నారు. నేను ఎప్పుడూ చూసే పరస్పర సహనపు స్థాయి ఇప్పుడు కనిపించడం లేదని చెప్పేందుకు బాధపడుతున్నాను. ఇప్పుడు అమెరికాలోనూ. ఇండియాలోనూ అది కనిపించడం లేదు అని రాహుల్ పేర్కొన్నారు. అమెరికా పోలీసుల చేతుల్లో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మృతిచెందడం దారుణమనీ, దీనిపై అమెరికా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ బర్నస్ వ్యాఖ్యానించిన సందర్భంగా రాహుల్ అందుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.













