ఓ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నా : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ అంశంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆయన ఈసారి పోటీచేసిన వయనాడ్ (కేరళ), రాయ్‌బరెలీ ( యూపీ)లో ప్రజలు ఆయన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. దీంతో ఆయన ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై రాహుల్ స్పందించారు. తాను ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఏ నిర్ణయం తీసుకొన్నా రెండు నియోజకవర్గాలు సంతోషంగా అంగీకరిస్తాయన్నారు. ఆయన కేరళలోని మల్లప్పురంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వయనాడు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేను ఓ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ వయనాడ్ లేదా రాయ్‌బరేలీలో ఒక దానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు.