ఓటు హక్కు వినియోగించుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంతో పాటు పీసీసీ కార్యాలయాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, అమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢల్లీిలోని ఏఐసీసీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర క్యాంపు నుంచే ఓటు వేశారు. రాహుల్ గాంధీ సహా భారత్ జోడో యాత్రలో పాల్గొన్న దాదాపు 40 మంది ప్రతినిధులు బళ్లారి వద్ద జోడో యాత్ర క్యాంప్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.













