ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్న రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఆయన పటేల్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్‌నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిపై 30వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన నవంబర్ 2022లో ఢిల్లీ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. లేబర్ ఎంప్లామెంట్, కో ఆపరేటివ్ మంత్రితో పాటు పలు శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.













