ఆ వార్తలో నిజం లేదు… పివి సింధు
తన కుటుంబ సభ్యులతో ఘర్షణ పడి లండన్‌కు వెళ్లిపోయినట్లు తనపై వచ్చిన వార్తలను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఖండించారు. తాను న్యూట్రిషన్లో సలహాల కోసం, శిక్షణ కోసం లండన్ వచ్చానే తప్ప మరే కారణం లేదని అన్నారు. ఓ పత్రికలో పివి సింధు తన తల్లితండ్రులతో ఘర్షణ పడి, అకాడమీలో శిక్షణ తీసుకోవడం ఇష్టం లేక లండన్‌కు వెళ్లిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై పివి సింధు వివరణ ఇచ్చారు. తన కేరీర్ కోసం వారి జీవితాన్నే త్యాగం చేసిన తన తల్లితండ్రులతో తానెందుకు ఘర్షణ పడతానని పివి సింధు ప్రశ్నించారు. తన తల్లితండ్రులతో తాను రోజూ టచ్‌లో ఉంటానని, వారు తననెంతో సపోర్ట్ చేస్తారని ఆమె తెలిపారు. కోచ్ గోపిచంద్తోనూ తనకు ఎటువంటి సమస్యలు లేవని, న్యూట్రిషన్తోపాటు ఇతర శిక్షణ కోసం లండన్‌లోని గటోరాడే స్పోర్టస్ సైన్స్ ఇన్స్టిస్ట్యూట్కు వచ్చినట్లు పివి సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు.













