ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేశారు. డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ధామీతో లెఫ్టినెంట్ గవర్నర్ గుర్మీత్ సింగ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రి నితిన్ గడ్కరీతో పాటు కాబోయే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం పుష్కర్ సింగ్ ధామీ ప్రధాని ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అనంతరం మంత్రులుగా సత్పాల్తో పాటు ధన్సింగ్ రావత్, గణేశ్ జోషి, రేఖా ఆర్య, సుబోధ్ ఉనియాల్, సౌరవ్ బహుగుణ, ప్రేమ్‌చంద్ అగర్వాల్, చందన్ రామ్ దాస్‌లు సైతం మంత్రులుగా ప్రమాణం చేశారు. పుష్కర్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం ఇది రెండోసారి. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు గాను 47 చోట్ల బీజేపీ విజయ దుందుభి మోగించింది. అయితే తన సొంత స్థానం ఖటిమాలో పుష్కర్ ధామీ ఓటమి పాలయ్యారు.













