మల్లికార్జున ఖర్గేకు షాక్ …రూ.100 కోట్ల పరువునష్టం
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది. బజరంగ్ దళ్ వివాదంలో ఆయనపై దాఖలైన రూ.100 కోట్ల పరువునష్టం కేసులో ఈ సమన్లు ఇచ్చింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశమే అందుకు కారణమైంది. అధికారంలోకి వస్తే బజరంగ్దళ్, పీఎఫ్ఐ సంస్థలపై నిషేధం విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని ఆ పార్టీ మెనిఫెస్టోలో పేర్కొనడం రాజకీయ రగడకు తెరతీసింది. దీనిపై హిందూ సంఘం నేత ఒకరు పరువు నష్టం కేసు వేయగా, పంజాబ్‌లోని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. అయితే ఎన్నికలకు ముందే తీవ్ర విమర్శలు రావడంతో కాంగ్రెస్ తన హామీపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. బజరంగ్‌దళ్‌ను నిషేధించే ప్రతిపాదన ఏదీలేదని స్పష్టం చేసింది.













