అమరీందర్ వ్యవహారంతో కాంగ్రెస్ లో ఇబ్బందులు
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరిని చేస్తోంది. అమరీందర్ సింగ్ రాజీనామా.. చన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. సిద్ధూ రాజీనామా చేయడం వంటి సంఘటనలతో పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకోగా, మరోవైపు కాంగ్రెస్లో ఈ పరిణామాలు పార్టీకి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అమరీందర్ సింగ్ అమిత్ షాతో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. త్వరలోనే కెప్టెన్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా అమరీందర్ సింగ్ ఈ వార్తలపై స్పందించారు. బీజేపీలో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండనని.. అలా అని బీజేపీలో కూడా చేరనని అమరీందర్ స్పష్టం చేశారు.













