ఆ నిర్ణయం వెనక్కి… వీఐపీలందరికీ మళ్లీ
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎట్టకేలకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. పంజాబీ సింగర్ సిద్దూ మూసే వాలా హత్య నేపథ్యంలో పంజాబ్‌లో వీఐపీలందరికీ భద్రతను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. జూన్ 7వ తేదీలోగా ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని పంజాబ్, హరియాణా హైకోర్టుకు భగవంత్‌మాన్ ప్రభుత్వం నివేదించింది. భవిష్యత్తులో మళ్లీ ఈ నిర్ణయాన్ని అమలు చేయడంపైనా ఎలాంటి ఆలోచనలు చేయడం లేదని కోర్టు తెలిపింది. 400 మందికి పైగా వీఐపీలకు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడం, ఆ మర్నాడే మూసేవాలా దారుణ హత్యకు గురవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు తలెత్తడంతో పాటు వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నారు.













