ఘనంగా పంజాబ్ సీఎం భగవత్మాన్ పెళ్లి
చండీగఢ్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్మాన్ సింగ్ పెళ్లి డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు ఎంపిక చేసిన ఆహ్వానితులు మాత్రమే హాజరయ్యారు. మాన్ తల్లి, సోదరి, బంధువులు, కొంతమంది అతిథులతో సహా కుటుంబ సభ్యులను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. 48 ఏళ్ల భగవత్మాన్కు ఇది రెండో పెళ్లి. ఆయన 2015లో తన మొదటి భార్య నుంచి విడిపోయాడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. భగవత్మాన్ భార్య గురుప్రీత్ కౌర్‌ది హర్యానాలోని కురుక్షేత్రలోని పెహోవా. నాలుగేళ్ల క్రితం హర్యానాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసింది.













