ఏపీ తహారలోనే పంజాబ్ ప్రభుత్వం.. ఇంటివద్దకే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాదరణ పొందిన ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 26,000 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముక్తసర్ జిల్లాలో పత్తి రైతులకు రీయింబర్స్మెంట్ కింద రూ.41.89 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి గోధమ పిండితోపాటు ఇతర సరుకులను హోం డెలివరీ చేయనున్నారు. మొబైల్ ప్రైస్ షాప్స్ (ఎంపీఎస్)గా పిలిచే రవాణా వాహనాల్లో రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేస్తారు.













