రాజ్యసభలో అరుదైన ఘటన
రాజ్యసభలో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. మేటి అథ్లెట్, ఎంపీ పీటీ ఉష రాజ్యసభ చైర్మన్ చైర్లో కూర్చుని సభా వ్యవహారాలను నడిపించారు. చైర్మన్ జగదీప్ ధన్కర్ సభలో లేని సమయంలో పీటీ ఉష సభా కార్యక్రమాలను నిర్వహించారు. సభా కార్యక్రమాలను చూడడం గర్వంగా ఉందని, మరిన్ని మైలురాళ్లను అందుకోనున్నట్లు ఆమె తెలిపారు. 2022లో బీజేపీ తరపున రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయిన విషయం తెలిసిందే. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేని సమయంలో వైస్ చైర్పర్సన్స్ కమిటీలోని సభ్యులు ఎవరో ఒకరు సభా అధ్యక్ష బాధ్యతలు చూస్తారు. గతేడాది రాజ్యసభకు నామినేట్ అయిన పీటీ ఉష ఈ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.













