రాజ్యసభ ఎంపీగా పరుగుల రాణి ప్రమాణం
ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన పరుగుల రాణి, మాజీ అథ్లెట్ పీటీ ఉష పార్లమెంట్ భవనంలో ప్రమాణం చేశారు. రాజ్యసభ స్పీకర్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. హిందీ భాషలో ఆమె ప్రమాణం చేయడం విశేషం. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీని పీటీ ఉష కలిశారు. 1964, జూన్ 27వ తేదీన పీటీ ఉష జన్మించారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆమె పుట్టారు. పయ్యోలీ ఎక్స్‌ప్రెస్ అన్న నిక్‌నేమ్ ఆమెకు ఉంది. క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అని కూడా ఆమెను పిలుస్తారు. జాతీయ స్థాయిలో ఆమె అనేక పతకాలను గెలిచింది.













