ఆమ్ ఆద్మీ కీలక ప్రకటన.. ప్రధాని అభ్యర్థిగా
2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. ముంబయి వేదికగా 27 పార్టీలు భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇండియా కూటమి తరపున అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ సరైన వ్యక్తి అంటూ ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక ఖక్కర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ దేశానికి ప్రయోజనం చేకూర్చే మోడల్‌ను తీసుకురాగలరని అన్నారు. తమ అభ్యర్థిగా కేజ్రీవాల్‌ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.













