కర్ణాటక ఫలితాలపై ప్రియాంక గాంధీ స్పందన ఇదే!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి చారిత్రక విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. భారత్‌ను ఏకం చేసేందుకు లభించిన విజయం ఇదని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీ కఠోర శ్రమ గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ నిర్విరామంగా పని చేస్తుంది’ అని తెలియజేశారు. దేశాన్ని ఏకం చేసే రాజకీయ విజయం ఇది అని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయం అందించిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కర్ణాటక అభివృద్ధికి ఈ విజయం నిదర్శనం అని చెప్పిన ఆమె.. ఈ గెలుపు కోసం పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. ‘మీ కష్టానికి తగిన ఫలితం దక్కింది’ అని పేర్కొన్నారు. చివరగా జై కర్ణాటక.. జై కాంగ్రెస్ అని ట్వీట్ చేశారు.













