అందుకు మన దేశం సన్నద్ధంగా ఉంది: కోవింద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన పదవీ విరమణ సందర్భంగా జాతిని ఉద్దేశించి చివరిసారిగా ప్రసంగించారు. కొవింద్ తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కోవింద్ పరౌంఖ్ గ్రామానికి చెందిన రామ్నాథ్ కోవింద్ ఈనాడు మిమ్మిలి ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడంటే అందుకు ప్రధాన కారణం పటిష్టమైన మన ప్రజాస్వామ్య వ్వవస్థలలోని అంతర్లీన శక్తే అని అన్నారు. 21వ శతాబ్దాన్ని భారత్ శతాబ్దంగా చేయడానికి కావలసిన సత్తా మన దేశానిjకి ఉన్నదని గట్టిగా విశ్వసిస్తున్నానని ఆయన చెప్పారు. నా జీవితంలో అత్యంత చిరస్మరణీయ క్షణాల్లో ముఖ్యమైనది ఏమిటంటే నా హయాంలో స్వస్థలం కాన్పూర్ను సందర్శించి నా గురువుకలు పాదాభివందనం చేయడం అని అన్నారు. యువతరం, తమ గ్రామం లేదా పట్టణం, తమ పాఠశాలలు, గురువులతో అనుబంధాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని కొవింద్ తెలిపారు.













