గత సంప్రదాయినికి భిన్నంగా ఈసారి… జవాన్లతో రాష్ట్రపతి
గత సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ ఈసారి దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. లడఖ్‌లోని డ్రాస్ సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ దేశ రాజధాని నగరంలో జరిగే దసరా వేడుకల్లో పాల్గొంటుండడం పరిపాటి. అయితే రాష్ట్రపతి కొవింద్ గురు, శుక్రవారాల్లో జమ్ముకశ్మీర్, లడఖ్‌ల్లో పర్యటించనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడిరచింది. రాష్ట్రపతి లేప్‌ా లోని సింధుఘాట్ వద్ద సింధు దర్శన్ పూజలో పాల్గొంటారు. అనంతరం జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్ బలగాలతో మాట్లాడతారు. ఈ నెల 15న డ్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరజవాన్లకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అధికారులు, జవాన్లతో మాట్లాడతారు.













