15 సంవత్సరాల తర్వాత రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి కోవింద్

15 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రైలు ప్రయాణం చేస్తున్నారు. సప్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి కాన్పూర్ వరకు ప్రత్యేక రైలులో ఆయన ప్రయాణం చేస్తున్నారు. యూపీలో తన స్వస్థలాన్ని చూడడానికి రాష్ట్రపతి రాంనాథ్ బయల్దేరారు. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులను కలుసుకోనున్నారు. తిరిగి ఈ నెల 29న ఢిల్లీకి చేరుకుంటారు. అయితే రాష్ట్రపతి హోదాలో కోవింద్ స్వగ్రామానికి వెళ్లడం ఇదే ప్రథమం. అయితే 2006 లో రాష్ట్రపతి హోదాలో ఏపీజే అబ్దుల్ కలాం రైలులో ప్రయాణించారు. బిహార్‌లోని తన స్వగ్రామమైన సివాన్‌లో పర్యటించారు. మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాత్రం తరుచుగా రైలు ప్రయాణం చేసేవారు.