జగన్నాథ్ మందిర్ లో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని జగన్నాథ్ మందిర్ కు రాష్ట్రపతి వెళ్లారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జగన్నాథుడిని దర్శించుకున్న ముర్ము ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు రాష్ట్రపతికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. రాష్ట్రపతి ముర్ము ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.