పీవీ నరసింహారావుకు భారతరత్న.. అవార్డు అందుకున్న కుమారుడు
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పీవీ నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్, స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా భారతరత్న అవార్డు అందుకున్నారు. చరణ్ సింగ్ తరపున ఆయన మనువడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ భారతరత్న అందుకున్నారు. రేపు రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నారు.













