ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటేశారు. ఢల్లీిలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.