సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ … ప్రమాణ స్వీకారం

సిక్కిం ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్యాంగ్‌టక్‌లోని పల్జోర్ స్టేడియంలో తమాంగ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు ఎస్‌కేఎం ఎమ్మెల్యేలు సోనమ్ లామా, అరుణ్ కుమార్ ఉప్రేతి క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.