ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు : ఉపరాష్ట్రపతి
భారత ప్రపంచ దృష్టి కోణానికి నిజమైన ప్రతినిధులు ప్రవాస భారతీయులేనని, దేశాభివృద్ధికి తోడ్పడేందుకు వారంతా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రవాస భారత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఆర్ఐల విజయాలను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ సాంస్కృతిక రాయబారులుగా కొనసాగాలని సూచించారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆక్షించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలు తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని, వివిధ రంగాల్లో రాణిస్తున్నా తమ మూమాలను మర్చిపోరాదన్నారు. దేశాభివృద్ధి లో ప్రవాసుల సహకారానికి గుర్తుగా ఏటా జనవరి 9న ఈ దినోత్సవం నిర్వహిస్తుంటారు. 1915లో ఈరోజే గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగొచ్చి, తదనంతరం స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించడం విశేషం.













