ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం … ఇక తప్పుకుంటున్నా

ఎన్నికల వ్యూహకర్త బాధ్యతలను ఇకపై చేపట్టబోనని, ఈ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీవితంలో మరేదైనా చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఎంసీ, డీఎంకేల కోసం పని చేశారు. ఈ రెండు పార్టీలు తాజా ఓట్ల లెక్కింపులో వి•యాన్ని దక్కించుకున్నాయి. ఆ రెండు పార్టీల విజయం దాదాపు ఖాయమే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ ప్రస్తుతం చేస్తున్న పనిని ఇకపై కొనసాగించలేనని వెల్లడించారు. బెంగాల్ గెలిచిందని, అందుకు తాను ఎంతో చేయాలో అంతా చేశానని అన్నారు. కొంతకాలం విరామం తీసుకోవాలనుకుంటున్నానని పేర్కొనారు. అయితే గతంలో తాను కూడా రాజకీయాల్లోకి వచ్చినా, విఫలం అయ్యానని వెల్లడించారు..