గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై.. ప్రమోద్ సావంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గోవాలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు హాజరయ్యారు. రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన ప్రమోద్ సావంత్‌కు గవర్నర్ శ్రీధరన్, ప్రధాని మోదీతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లను గెలుచుకుంది. 40 సీట్లున్న గోవాలో బీజేపీ 20 సీట్టు సాధించగా, మహరాష్ట్రవాదీ గోమాన్‌తక్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతుగా నిలిచారు.













