ముచ్చటగా మూడోసారి మోదీ గెలిస్తే.. ఆరు నెలలలో పీవోకే మనదే..యోగి ఆదిత్యనాథ్..

బీజేపీ పార్టీకు స్టార్ క్యాంపైనర్గా ప్రఖ్యాతి గాంచిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ గెలిచినట్లయితే 6 నెలల లోపు ప్రతి భారతీయుడు కలగనే పీవోకే.. మన భారత దేశంలో అంతర్భాగంగా మారుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి ప్రజలలో మంచి హైప్ క్రియేట్ చేయడానికి ఆయన చాలా మంచి మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. పీవోకేని రక్షించుకోవడం పాకిస్తాన్ కు చాలా పెద్ద సవాలుగా మారింది అని ఆదిత్యనాథ్ విమర్శించారు. శనివారం మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గత కొద్ది కాలంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయని.. స్థానిక ప్రజలుకు.. పాకిస్తాన్ దళాలకు మధ్య పలు ఘర్షణలు కూడా సంభవించాయని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ పట్ల అక్కడి ప్రజలలో వ్యతిరేక భావన నెలకొందని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో నక్సలిజం, ఉగ్రవాదం దృఢంగా అణిచివేసామని.. ఈ 10 సంవత్సరాలలో అందరూ కొత్త భారతదేశాన్ని చూశారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశ సరిహద్దుల్లో భద్రత కల్పించడంతోపాటు.. పలు ప్రాంతాలలో ఉగ్రవాద చర్యలను ప్రభుత్వం ఎంతో చాకచక్యంగా అణిచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అయోధ్య రామాలయం విషయంలో మోదీ కు మంచి ప్రజాదరణ లభించింది.. ఇక ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా భారత భూభాగంలో కలిపేస్తాము అనడం నాకు క్రేజ్ ను మరింత పెంచుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.