జూనియర్ బాడ్మింటన్ చాంఫియన్‌షిప్ ప్రారంభించినట్లు వెల్లడించిన పీఎన్బీ మెట్‌లైఫ్
రేపటి బాడ్మింటన్ స్టార్లను తీర్చిదిద్దే లక్ష్యంతో ఆరవ ఎడిషన్ చాంఫియన్‌షిప్ దేశవ్యాప్తంగా 12 నగరాలలో 7–17 సంవత్సరాల లోపు వ్యక్తుల కోసం జరుగనుంది.
భారతదేశంలో సుప్రసిద్ధ ప్రైవేట్ జీవిత భీమా కంపెనీలలో ఒకటైన పీఎన్బీ మెట్‌లైఫ్, తమ జూనియర్ బాడ్మింటన్ చాంఫియన్‌షిప్ ఆరవ ఎడిషన్‌ను ప్రారంభిస్తోన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 12 నగరాలలో 12 రాష్ట్రాల బాడ్మింటన్ అసోసియేషన్స్ కింద ఈ పోటీ నిర్వహించనున్నారు.
జెబీసీ 2022 ప్రారంభ కార్యక్రమంలో పీఎన్బీ మెట్‌లైఫ్ బ్రాండ్ ప్రచారకర్త మరియు రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మాట్లాడుతూ ‘‘భారతదేశంలో యువ, ఔత్సాహిక ప్రతిభావంతులకు అత్యున్నత వేదికగా పీఎన్బీ మెట్‌లైఫ్ యొక్క జూనియర్ బాడ్మింటన్ చాంఫియన్‌షిప్ నిలుస్తుంది. రేపటి బాడ్మింటన్ స్టార్లను తీర్చిదిద్దాలనే ప్రయత్నంతో అశేష కృషి చేస్తోన్న బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.
పీఎన్బీ మెట్‌లైఫ్ జెబీసీని, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 12 నగరాలలో నిర్వహించనున్నారు. నేటి యువతరం నడుమ ఆరోగ్యవంతమైన జీవనశైలి ఆవశ్యకతను ప్రచారం చేయాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను 7 నుంచి 17 సంవత్సరాలలోపు వారంతా పాల్గొనేలా తీర్చిదిద్దారు. ఈ మ్యాచ్‌లను అండర్–9,11,13, 15 మరియు 17 విభాగాలుగా విభజించారు.
అశీష్కుమార్ శ్రీవాస్తవ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో, పీఎన్బీ మెట్‌లైఫ్ మాట్లాడుతూ ‘‘ ఆరవ ఎడిషన్ జెబీసీ ప్రారంభించడం పట్ల ఆనందంగా ఉన్నాము. దేశవ్యాప్తంగా యువ బాడ్మింటన్ అభ్యర్థులకు ఇది వినూత్నమైన వేదికగా నిలువడంతో పాటుగా భారతీయ బాడ్మింటన్ సమాజం మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా కార్యక్రమంగా నిలిచింది. ఓ వ్యక్తి శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటేనే ఆర్ధికంగానూ ఆరోగ్యవంతంగా ఉండగలడు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు ప్రోత్సహిస్తున్నాము’’ అని అన్నారు.
జెబీసీ 2022 కోసం రిజిస్ట్రేషన్‌ను 931 948 3219కు కాల్ చేసి పూర్తి చేసుకోవచ్చు.
హైదరాబాద్ వరకూ సెప్టెంబర్ 25 నుంచి28 తేదీలలో చేతన్ఆనంద్ బాడ్మింటన్ అకాడమీ వద్ద ఈ పోటీలు జరుగనున్నాయి.













