ఆగస్టు 15కు ప్రత్యేక అతిథులు వీరే!
ఎర్రకోట వద్ద ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలు ఈసారి మరింత ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. భారతదేశం తరపున ఒలంపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులందరినీ ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిలుగా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నారు. దీనికి తోడు ఒలంపిక్ క్రీడాకారులందరితో తన నివాసంలో ప్రధాని ముఖాముఖీ సంభాషించనున్నారు. అయితే సుమారు 127 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. వీరితో పాటు వంద మంది కోచ్‌లు, అసిస్టెంట్ సిబ్బంది ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈసారి భారీ సంఖ్యలో భారత బృందాన్ని ఒలింపిక్స్ పంపినట్టు తెలిపారు. అనేక క్రీడల్లో మొదటిసారి క్వాలిఫై అయ్యామని, గట్టి పోటీ ఇస్తున్నామని తెలిపారు. భారతీయ క్రీడాకారులు ఆత్మవిశ్వాసం, దీక్ష ఉత్సాహం చాలా ఉన్నతంగా ఉన్నట్లు తెలిపారు. సరైన ట్యాలెంట్‌ను గుర్తించి, ప్రోత్సహిస్తే ఇలాంటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని ఆయన అన్నారు.













