వ్యాక్సిన్ వచ్చేంతవరకూ జాగ్రత్త : మోదీ
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రజలకు పలు సూచనలు చేశారు. కరోనా టీకా వచ్చేవరకూ అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. జబ్ తక్ దవాయీ నహీ, తబ్ తక్ ధిలాయీ నహీ (వ్యాక్సిన్ వచ్చేంతవరకూ నిర్లక్ష్యం వద్దు) అని ప్రజలకు సూచించారు. మాస్కు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మధ్యప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన 1.75 లక్షల గృహాలను వీడియో మాధ్యమంగా మోదీ ప్రారంభించారు. గతంలో ఏదైనా పని కోసం పేదలు ప్రభుత్వాల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు వారివద్దకే ప్రభుత్వ పాలన వచ్చిందన్నారు. కరోనా సమయంలో కూడా దేశ్యాప్తంగా 18 లక్షల గృహాలను తమ ప్రభుత్వం నిర్మించిందన్నారు. ఒక్కో ఇంటిని కట్టడానికి సగటున 45-60 రోజులు పట్టిందని ఇది రికార్డు అని చెప్పారు.













