రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో ఎదుర్కొన్న భద్రత వైఫల్యాలను గురించి తెలియజేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రధానికి ఫోన్ చేశారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోదీని నిరసన కారులు అడ్డుకోవడంతో ఒక ప్లైఓవర్‌పై 20 నిముషాలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి, తన పర్యటన రద్దు చేసుకుని వెనక్కు వచ్చేశారు. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.













