మరోమారు లాక్డౌన్ ఉండదు : మోదీ
దేశంలో మరోమారు లాక్డౌన్ ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ సృష్టం చేశారు. అన్లాక్ -2 ఎలా అమలు చేయాలన్న విషయమై చర్చించాలని అన్నారు. కరోనా ఉదృతి అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో సృష్టతనివ్వాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారు. దీనిపై ప్రధాని సృష్టతనిచ్చారు. దేశంలో లాక్డౌన్ దశ ముగిసి.. అన్లాక్ల దశ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్లాక్ -1 నడుస్తోందన్నారు. అన్లాక్-2 ఎలా అమలు చేయాలన్న విషయమై చర్చించాలని ముఖ్యమంత్రులతో మోదీ అన్నారు. దేశంలో కరోనా కేసులు తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నందున మరోమారు లాక్డౌన్ విధిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధాని మోదీ సృష్టత నివ్వడం గమనార్హం.













