దేశసేవ విషయంలో ఎన్నడూ రాజీ పడలేదు : ప్రధాని
దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న స్వరాష్ట్రం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ పటేల్ సేవా సమాజ్ ట్రస్ట్ నిర్మించిన కేడీపీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మహాత్ముడు, సర్దార్ పటేల్ కలలు కన్న భారత్‌ను నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్లు నిజాయతీగా కృషి చేశామని అన్నారు. గుజరాత్ నేర్పిన పాఠాలే తనను ఇలా తీర్చిదిద్దాయని కృతజ్ఞత చాటారు. జన్‌ధన్ యోజన ద్వారా పేద ప్రజలు ప్రయోజనం పొందారు. రైతులు, కార్మికుల జన్‌ధన్ ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏర్పాటు చేశాం. దేశ ప్రజలు సిగ్గుతో తలవంచుకునేలా చేసే ఏ పనిని అనుమతించలేదు అని వెల్లడిరచారు. వంశపారంపర్య రాజకీయాలు చేస్తోన్న పార్టీలపై విమర్శలు గుప్పించారు. యూపీఏ పాలనను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాల్సిన అవశ్యకతను వెల్లడిరచారు.













