పూరి-హౌరా మధ్య వందేభారత్ వచ్చేసింది
ఒడిశాకు తొలి వందేభారత్ రైలు వచ్చేసింది. పూరి నుంచి హౌరా వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఆ రైలును స్టార్ట్ చేశారు. హై స్పీడ్ వందేభారత్ వారానికి ఆరు రోజులు నడవనున్నది. గురువారాలు ఈ ట్రైన్ ఉండదు. పూరి-హౌరా రైలుకు మొత్తం ఏడు స్టాప్‌లు ఉన్నాయి. 16 కోచ్‌లు ఉండే ఈ రైలు ఉదయం 6:10 నిమిషాలకు హౌరాలో ప్రారంభం అవుతుంది. ఇక పూరికి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు చేరుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూరి నుంచి 1:50 నిమిషాలకు బయలుదేరి రాత్రి 8:30 నిమిషాలకు హౌరా చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఖరగ్‌పూర్, బాలసోర్, భద్రక్, జాబ్పూర్-కియోజాన్ రోడ్డు, కటక్, భువనేశ్వర్, కుర్దా రోడ్డులు ఈ రైలు ఆగుతుంది. ప్రతి స్టేషన్లో రెండు నిమిషాలు మాత్రమే ట్రైన్ ఆగనున్నది.













