ఆ పేరు వెనక ఉన్న ఉద్దేశం అదే : మోదీ
చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు సూచించడం వెనక ఉన్న కారణాన్ని ప్రధాని మోదీ వివరించారు. బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రధాని బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చంద్రయాన్`3 దిగిన ప్రాంతానికి శివశక్తి అని పెట్టాం. మనం శివ అనే పదాన్ని శుభంగా భావిస్తాం. దేశంలోని నారీ మణుల గురించి మాట్లాడే సమయంలో శక్తి పదాన్ని వాడుతాం. ఆ పేరు వెనక ఉద్దేశం అదే. అలాగే చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి గుర్తింపునిస్తూ దానిని తిరంగా పాయింట్ అని పిలుచుకుందాం అని అన్నారు. నేను బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా వెళ్లాను. ఆ సమయంలో చంద్రయాన్-3 విజయంపై ప్రపంచ దేశాల నుంచి ఎన్నో అభినందన సందేశాలు వచ్చాయి అని తెలిపారు.













