దేశంలో మొట్టమొదటి సారి… వాటర్ మెట్రో వచ్చేస్తోంది
భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రో ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని కోచిలో రేపు పచ్చజెండా ఉపనున్నారు. నగరాల్లో మెరుగైన ప్రజారవాణా సౌకర్యాలను అందించడంలో భాగంగా కోచివాసులకు వాటర్ మెట్రో సేవలను అందిస్తుందని అధికారులు తెలిపారు. ఒక వినూత్నమైన అర్బన్ మాస్ ట్రాన్సిట్సిస్టమ్గా పేరొందిన వాటర్ మెట్రో సాధారణ మెట్రో సిస్టమ్ తరహా ప్రయాణ అనుభవాన్ని ప్రజలకు అందిస్తుంది. కోచి లాంటి నగరాల్లో వాటర్మెట్రో ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని సమకూర్చడంలో మూస ధోరణి అవలంభించుకుండా ఒక ఆచరణాత్మకమైన విధానాన్ని మోగీ ప్రభుత్వం చేపట్టిదని అధికారులు తెలిపారు.













