వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి మరో సారి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు రోజు నిర్వహించే భారీ రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొంటారని వారణాసి నగర బీజేపీ అధ్యక్షుడు విద్యా సాగర్ రాయ్ వెల్లడిరచారు. రోడ్ షో నిర్వహించే మార్గం ఖరారైందని, అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. వారణాసి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్, బీఎస్పీ అభ్యర్థిగా అతహర్ జమాల్ లారీ బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరగనుంది.